nmrao bandi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;nmrao bandi

తగునా ఇది బామ్మా తమరే ఇట పుల్లలెట్ట
తగునా ఇది బామ్మా తమరే సరి జెల్ల కొట్ట
తగునా ఇది బామ్మా అరెరే ఇట పొగను బెట్ట
తగునా ఇది ఏమ్మా కిరికిరితో లాగి కొట్ట
పదవే ఇక బామ్మా దులిపెయ్ నీ కంద తట్ట
... ఇంకో పద్యాన్ని కొట్ట ... తాతయ్యకు దురద పెట్ట
న మస్కారం బామ్మో ... 🙏🙏🙏🙏 ☺️ ... జేక్/ఓక్

19 April 2024 9:35 PM

nmraobandi;nmrao bandi

ఆవలించినా అక్షరం ముక్క రాదు గురువు గారు.
written, tune based. ఏదో తోచినట్లుగా అల్లుకు
పోవడమే గురువు గారు. మీకు నచ్చినందుకు
సంతోషం :)

04 April 2024 12:05 PM

nmraobandi;nmrao bandi

ఏదో తేడా ఉందండి నాలో ... నాకు తెలియకుండానే (నేనో మందుబాబుని కాకుండానే - నమ్మండి ఒట్టు) ఓ తెలియని మైకంలో అలా రాసేస్తూ ఉంటానండి. నాపైన మీకొచ్చిన అనుమానమే నాలో నాక్కూడా నాపైన ఎప్పుడూ వస్తూ ఉంటుందండి. అయినా మన చేతిలో ఏముందసలు అని సర్దేసుకుంటూ మరొక్క పాట అందుకుంటా ... అంతే సార్ - తస్సలరవల 🥃🥃😄 ...

30 March 2024 8:00 PM

nmraobandi;nmrao bandi

అప్పు'డప్పు'డల్లా 'వేస్తూ'నే ఉంటాను గురూజీ 😊
అయినా ..
గీత మారలేదు
రాసే రాత ఆగలేదు😄
మీ శుభాకాంక్షలకు 🙏🙏🙏

29 March 2024 6:15 AM

nmraobandi;nmrao bandi

గురువు గారు, ఏం జరిగిందో తెలియదు కానీ మీ కామెంట్ చూశాక సెట్టింగ్స్ లోకెళ్ళి అటూ ఇటూ కెలికిన తరువాత ప్రస్తుతం సర్దుకున్నట్లుగానే అనిపిస్తోంది. తీరా చూస్తే మీ కామెంట్ బ్లాగర్ కామెంట్స్ సెక్షన్ లో చక్కగా దర్శనమిచ్చింది. అందుకే దాన్ని నా పోస్టులో తిరిగి ముద్రించాను. కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యుడిని.

పోస్ట్ బాగుందన్న మీ ప్రశంసకు హృదయపూర్వక కృతజ్ఞతలు గురూజీ 🙏🙏🙏

31 January 2024 6:20 PM

nmraobandi;nmrao bandi

sarma commented on "నా ఆల్బం (my album) ... బంగారు పిచిక (1968) (bangaru pichika) చిత్రం లోని "మనసే గని తరగని ..." గీతానికి నా అనుసరణా గీతం "వనితావని మధువని ఈ అందాల గని వినదేమని మది ధ్వని కని నే తనకని ..." ... గాయకుడు djlivesinger dhanumjay ... (పల్లవి, చరణాల లోని మొత్తం వాక్యాలన్నీ "ని" ప్రాసతో వ్రాయబడిన ప్రత్యేక గీతం) ..."
Yesterday
అక్షరాలతో చెడుగుడు ఆడినట్టుంది :)

31 January 2024 6:08 PM

nmraobandi;nmrao bandi

మీ ఆరోగ్యం చక్కగా కుదుట పడి మీరు మరిన్ని ఉపయోగకరమైన పోస్ట్ లు తరచుగా వ్రాస్తూ ఉండాలని మనసా కోరుకుంటున్నాను గురువు గారూ. Plz take good care of your health sir 🙏 🙏 🙏 ...

20 January 2024 7:58 PM

nmraobandi;nmrao bandi

మీలాంటి పెద్దలు ఆప్యాయంగా, ఆదరణాపూర్వకంగా, అత్యంత అభిమానంతో అబ్బాయ్ అని పలకరిస్తే అంతకన్నా ఆనందం ఉంటుందా గురువు గారూ. మీ మెచ్చుకోలు రేకెత్తించిన అతిశయంతోనే పై అనుప్రాస వ్రాయడానికి తెగించాను. మీ అనురాగమే నాకు ఆశీర్వాదం గురువు గారూ. ధన్యవాదాలు 🙏 🙏 🙏 ...

20 January 2024 7:52 PM

nmraobandi;nmrao bandi

🙏 🙏 🙏 ...

20 January 2024 7:35 PM

nmraobandi;nmrao bandi

🙏 🙏 🙏 ...

19 January 2024 10:25 PM

nmraobandi;nmrao bandi

🙏 🙏 🙏 ...

19 January 2024 9:52 PM

nmraobandi;nmrao bandi

గుగ్గురువులిద్దరూ నన్నిలా ఎగరేసి ఎగరేసి ఫుడ్బాలాడేసు కుంటున్నారేం స్వాములూ!?
చైనా వాడు బోర్డర్ దగ్గర కాసుకున్నట్లుగా బ్లాగుల్లోకి రాంగానే నన్నట్టుకుని రంగులు పూసి, దారి కాచి, వాటాలేసుకుని మరీ దంగల్ ఆడేస్తున్నారు. మీ ఇద్దరి కన్నా చిన్నోణ్ణే కనుక ఏదో చూసీ చూణ్ణట్టు ఈ సారిలా కానిచ్చేయ్యండి సార్లూ. అవునట్లు మిత్రులందరికీ సంక్రాతి శుభాకాంక్షలు 🙏🙏🙏 ...

14 January 2024 6:34 PM

nmraobandi;nmrao bandi

మరండీ బామ్మ గారండీ మీ కంద పిజ్జాలలో నా జోలికొచ్చినోళ్లందర్నీ హైసరబజ్జా అంటూ
సాసేసుకు నంజుకున్నారంటే చాలు, గుంటూరు కారం కళ్ళకేసి కొట్టినట్లు ఆ బాపతోళ్లందరూ ఫరార్ ...
అలా మీరొక్కరే ఈ అఘాయిత్యాలను ఆపగలరు బాంమాశ్రీ .. జై బామ్మా .. జై జై బామ్మా ...

14 January 2024 6:18 PM

nmraobandi;nmrao bandi

నిండుగ నవ్వులాటకే, రాజావారూ,
చెండగ ధైర్యము గల సాహసినా ! ధీశాలీ!
'దండి'గ బోధించు వారు మీరు, మా కందరకును !
దండము మీ కిదె గురువా, పండుగ దినమున 🤝🙏

14 January 2024 11:40 AM

మరువం;nmrao bandi

మేడం గారూ, ఇవి నా కొంటె ముచ్చట్లు ...
(ఛందస్సుకు నాకు చుక్కెదురని
గమనించ ప్రార్ధన)

వంట దినుసులు శొంఠి ఘాటులు
పంట అదమగ గంటు కుదిరెను
ఇంటి వంటలు తింటి ముదమున
ఒంట బట్టగ అంటి రసములు

ఇంటి వంటలు ఒంట బట్టెను
అంటి అదునుగ శొంఠి ఘాటులు
వంట దినుసులు పంట కుదరగ
గంటు పెట్టుచు తింటి ముదమున

::))

11 September 2023 5:25 PM

Spicy India;nmrao bandi

మనదో సిగ్గులేని జాతి. రాష్ట్రాన్ని కర్కశంగా చీలుస్తుంటే పట్టని జాతి, విభజన హామీల్లో ఇవ్వాల్సిన వాటిలో కనీసం 10 శాతం ఇవ్వకపోయినా చీమ కొట్టినంత కూడా బాధ లేని వాళ్ళం, ఏమీ ఇవ్వకపోయినా అన్నీ ఇచ్చాం అనే కేంద్రాన్ని, బలగాన్ని, ఆదరించి జేజేలు కొట్టే అలగా జనం మనం. తన రాష్ట్రం లోని ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లు రెండూ నత్త నడక నడుస్తున్నా, ఆ రెంటినొదిలేసి, ఆంధ్ర పై పడి, సుమారు వందేళ్ల చరిత్రున్న ఆంధ్ర బ్యాంకు ని చిదిమేసి యూనియన్ కి తగిలిస్తే, సీతారామన్ మా ఆంధ్రా కోడలు అని మురిసిపోయి, తిలకం దిద్ది, చీరె, సారె పెట్టి చంకలు గుద్దుకునే జాతి. ఆఫ్టర్ అల్ జల్లికట్టు అనే ఓ ఆట నాపితేనే కేంద్రం కళ్ళకి ఉల్లిగడ్డని రుద్ది, పిల్లి మొగ్గేయించిన శూరులతో మనకేంటి పోలిక సార్. అంతెందుకు, తెల్లారి లేసిన కాణ్ణించి 90 శాతం తెలంగాణ వార్తలతోనే మనను వాయగొడుతున్నా, తెలుగు సినిమా భాష మొత్తాన్ని తెలంగాణీకరించినా, గుడ్లప్పగించి చూస్తూ, చెవులప్పగించి వింటూ పాప్కార్న్ నవులుకుంటున్న "చూడు పిన్నమ్మ" జాతి మనది. మనకెందుకు సారూ అలాంటి పట్టింపులూ, నిట్టూర్పులు?

అంతెందుకు, ఒక రాష్ట్రం లోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ, కూడబలుక్కోకుండానే, కేంద్రం లోని ఒకే ఒక పార్టీ కి తొత్తులై స్వప్రయోజనాలు తప్ప, రాష్ట్ర హితం పట్టించుకోని వానపాము నాయకులున్న రాష్ట్రం మనది కాక మరోటుందా, చెప్పండి?

04 May 2023 5:58 AM

పరాశర భారతి;nmrao bandi

మరో

ఏమిటండీ మీరు మాట్లాడేది 😳?
(jf 🙂🙂)

26 April 2023 6:11 AM

పరాశర భారతి;nmrao bandi

వామ్మో నా వళ్ళ కాదంటే కాదు. నాలిక మడతోయింది, మూతొంకర .🤣🤣🤣

15 April 2023 8:24 PM

పరాశర భారతి;nmrao bandi

వామ్మో, నవ్విన ప్రతిసారీ కళ్ళు తెరుచుకోవడానికి అంత టైం పడుతోందేమిటండీ!? గుండె బరుక్కు పోతాంది, నవ్వు చారలతో! ఈ పక్కన వామ్మో ఆ పక్కన బామ్మో! seems like HAPPY DAYS ARE HERE AGAIN ... :))

15 April 2023 8:11 PM

పరాశర భారతి;nmrao bandi

hilariously hilarious 😆😆😆

15 April 2023 7:57 PM